PEDDI: నార్త్ అమెరికాలో ఏకంగా అన్ని టికెట్స్ సొల్డ్ అవుట్

by Pulgam srinivas |   (  Updated:2026-05-11 13:01:24  IST  )

ఇప్పటివరకు కేవలం నార్త్ అమెరికాలోనే పెద్ది చిత్రానికి సంబంధించిన 7500కి పైగా టికెట్లు సోల్డ్ అవుట్ అయినట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

PEDDI: నార్త్ అమెరికాలో ఏకంగా అన్ని టికెట్స్ సొల్డ్ అవుట్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్‌ను జూన్ 3వ తేదీన భారీ స్థాయిలో ప్రదర్శించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అలాగే నార్త్ అమెరికాలో కూడా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. అలాగే ప్రీమియర్స్‌ను మూడవ తేదీనే ప్రదర్శించనున్నారు. ఈ చిత్రాన్ని నార్త్ అమెరికాలో ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ విడుదల చేయనుంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్స్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు కేవలం నార్త్ అమెరికాలోనే 7500కి పైగా టికెట్లు సోల్డ్ అవుట్ అయినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రీమియర్స్‌కు ఇంకా సమయం ఉండటంతో రాబోయే రోజుల్లో మరింత బుకింగ్స్ పెరిగే అవకాశం ఉందని, ఈ చిత్రం కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అభిమానుల నిరీక్షణకు తెర.. ‘పెద్ది’ ట్రైలర్ విడుదలకు డేట్ ఫిక్స్ చేసిన మూవీ మేకర్స్

Next Story