అభిమానుల నిరీక్షణకు తెర.. ‘పెద్ది’ ట్రైలర్ విడుదలకు డేట్ ఫిక్స్ చేసిన మూవీ మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-11 13:00:32  IST  )

రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ అప్‌డేట్‌ను మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

అభిమానుల నిరీక్షణకు తెర..  ‘పెద్ది’ ట్రైలర్ విడుదలకు డేట్ ఫిక్స్ చేసిన మూవీ మేకర్స్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi). ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు, గ్లింప్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. అయితే రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ అప్‌డేట్‌ను మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ట్రైలర్‌ను మే 18న విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.

అంతేకాకుండా ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ లుక్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ఆయన తన వెనుక ఒక మంచాన్ని తగిలించుకుని, ఒక చేతితో ట్రంక్ పెట్టెను, మరో చేతితో VIP అని రాసి ఉన్న కవర్‌ను పట్టుకుని రైల్వే ట్రాక్‌ను దాటుతూ కనిపిస్తున్నారు. ఈ రా అండ్ రస్టిక్ లుక్ సినిమాపై ఉన్న క్యూరియాసిటీని ఒక్కసారిగా పెంచేసింది. కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు జగపతి బాబు, దివ్యేందు శర్మ, సాయి కుమార్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం.. ప్రమోషన్ల విషయంలోనూ తగ్గేదే లే అన్నట్లుగా దూసుకుపోతోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మెగా అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పోస్టర్‌ను వైరల్ చేస్తున్నారు. మే 18న రాబోతున్న ట్రైలర్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

PEDDI: నార్త్ అమెరికాలో ఏకంగా అన్ని టికెట్స్ సొల్డ్ అవుట్

Next Story