ప్రభాస్‌కు తల్లిగా మాత్రమే నటించనన్నాను.. ఆ పాత్ర కాదని పూర్తి క్లారిటీ ఇచ్చిన రాశి.

by Pulgam srinivas |   (  Updated:2026-03-28 14:40:56  IST  )

ప్రభాస్‌కు తల్లిగా చేయనని మాత్రమే చెప్పాను.. సిస్టర్‌గా కాదు.. పూర్తి క్లారిటీ ఇచ్చిన రాశి.

ప్రభాస్‌కు తల్లిగా మాత్రమే నటించనన్నాను.. ఆ పాత్ర కాదని పూర్తి క్లారిటీ ఇచ్చిన రాశి.
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రాశి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె, ఇటీవల కాలంలో పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. తాజాగా ఈమె 'అనుమాన పక్షి' చిత్రంలో కీలక పాత్రలో నటించింది. దాంతో ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ చిత్రాన్ని ప్రమోట్ చేస్తోంది. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రభాస్‌కు తల్లి పాత్రలో నటించనని రాశి వెల్లడించింది.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దాంతో రాశి వ్యాఖ్యలపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా రాశి పాత్రికేయులతో ముచ్చటించింది. అందులో భాగంగా, “మీరు ప్రభాస్‌కు తల్లిగా, సిస్టర్‌గా నటించనని చెప్పారు కదా?” అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి స్పందించిన రాశి, తాను ప్రభాస్‌కు తల్లి పాత్ర చేయనని మాత్రమే చెప్పానని, కానీ సిస్టర్ పాత్ర చేయనని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేసింది. మదర్ పాత్రను మినహాయిస్తే ప్రభాస్‌తో ఏ పాత్రలో అయినా నటించడానికి సిద్ధంగా ఉన్నానని రాశి తాజాగా క్లారిటీ ఇచ్చింది.

Maruthi: తప్పుల నుంచే పాఠాలు నేర్చుకున్నాను.. ‘ది రాజాసాబ్’ డిజాస్టర్‌పై మారుతి ఎమోషనల్ పోస్ట్

Next Story