- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ramayana Movie : హాలీవుడ్ దిగ్గజ సంస్థతో 'రామాయణ' డీల్?
తాజా సమాచారం ప్రకారం హాలీవుడ్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ రామాయణ సినిమా ప్రపంచవ్యాప్త పంపిణీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడు పాత్రలో, నటి సాయి పల్లవి సీత పాత్రలో, కన్నడ స్టార్ హీరో యష్ రావణుడి పాత్రలో నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం ప్రస్తుతం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మహా ప్రాజెక్ట్‌ను మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా, రెండవ భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన కొన్ని ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన సినిమాకాన్ కార్యక్రమంలో ఈ సినిమాకు సంబంధించిన 20 నిమిషాల ప్రత్యేక ప్రదర్శన నిర్వహించగా, అక్కడి ప్రేక్షకులు మరియు సినీ పరిశ్రమ వర్గాల్లో ఈ చిత్రంపై భారీ చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం హాలీవుడ్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పంపిణీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే, ఈ చిత్రం అమెరికాలోనే 4500కు పైగా స్క్రీన్లలో విడుదల కావడం ఖాయం అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
సమ్మర్‌పై ఆసక్తి చూపుతున్న ‘స్వయంభు’ డిస్ట్రిబ్యూటర్లు.. కానీ అక్కడే పెద్ద చిక్కు






