- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమ్మర్‌పై ఆసక్తి చూపుతున్న ‘స్వయంభు’ డిస్ట్రిబ్యూటర్లు.. కానీ అక్కడే పెద్ద చిక్కు
'స్వయంభు' చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే ప్రతిపాదనను డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతల ముందుంచినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ ‘కార్తికేయ-2’ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆయనకు ఆ స్థాయి విజయం మాత్రం మళ్ళీ దక్కలేదు. ప్రస్తుతం ఈ నటుడు ‘స్వయంభు’ అనే భారీ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నభా నటేష్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా కనిపించనుండగా, భారత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన పలు ప్రచార చిత్రాలను విడుదల చేయగా, వాటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నుంచి విడుదలైన తొలి పాట కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో, సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు ఈ మూవీని ఎలాగైనా సమ్మర్ కానుకగా విడుదల చేయాలని నిర్మాతల ముందుకు ప్రతిపాదన తీసుకువచ్చినట్లు సమాచారం. ఇందుకు ప్రధాన కారణం ఈ చిత్రం భారీ వీఎఫ్ఎక్స్ (VFX) సినిమా కావడమే. సాధారణంగా ఈ తరహా చిత్రాలను పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. దాంతో కుటుంబ సమేతంగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా హాలిడేస్ సీజన్ దాటితే ఆ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని భావిస్తూ, సమ్మర్‌లోనే ఈ సినిమాను విడుదల చేయాలని డిస్ట్రిబ్యూటర్లు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఆ పనులు పూర్తి అయినా తర్వాత విడుదల తేదీని ప్రకటించాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.






