‘పెద్ది’ టికెట్ల రేట్ల పెంపునకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. వారికి థాంక్యూ చెబుతూ రామ్ చరణ్ ట్వీట్

by Chukka Sudharani |   (  Updated:2026-06-03 14:55:12  IST  )

తెలంగాణ ప్రభుత్వం ‘పెద్ది’ టికెట్ల రెట్లు పెంపునకు అనుమతి ఇవ్వడంతో రామ్ చరణ్ థాంక్యూ చెబుతూ ట్వీట్ పెట్టాడు.

‘పెద్ది’ టికెట్ల రేట్ల పెంపునకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. వారికి థాంక్యూ చెబుతూ రామ్ చరణ్ ట్వీట్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్నది. ఇప్పటికే ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై అదనంగా రూ. 100, మల్టీ ప్లెక్స్ థియేటర్లలో ప్రతి టికెట్ ధరపై అదనంగా రూ. 125 పెంచుకోవచ్చునని అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ సినిమాకు సంబంధించి జూన్ 3న రాత్రి ప్రదర్శించే ప్రత్యేక ప్రీమియర్ షోల టికెట్ ధరను రూ. 600 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక టికెట్ ధరల పెంపు సినిమా విడుదలైన రోజు నుంచి గరిష్టంగా 10 రోజుల వరకు వర్తిస్తుందని జీవోలో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రెట్లు పెంపునుకు అనుమతి ఇవ్వడంతో ‘పెద్ది’ టీమ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా.. ‘తెలుగు సినిమా శ్రేయస్సు కోసం మీ మద్దతు అండ్ నిరంతర ప్రోత్సాహాన్ని అందించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమట రెడ్డిKVR గారు అండ్ తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

హైదరాబాద్‌లో రామ్ చరణ్ గుడి.. క్షీరాభిషేకాలతో పూజలు చేస్తున్న మెగా అభిమానులు

Next Story