హైదరాబాద్‌లో రామ్ చరణ్ గుడి.. క్షీరాభిషేకాలతో పూజలు చేస్తున్న మెగా అభిమానులు

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-03 07:53:21  IST  )

సాధారణంగా స్టార్ హీరోల చిత్రాల రిలీజ్ సమయంలో థియేటర్స్ వద్ద పెద్ద పెద్ద కటౌట్స్ దర్శనమిస్తుంటాయి. కానీ కూకట్‌పల్లిలో మాత్రం ‘పెద్ది’ సినిమాలోని రామ్ చరణ్ క్యారెక్టర్‌ను పోలిన భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు.

హైదరాబాద్‌లో రామ్ చరణ్ గుడి.. క్షీరాభిషేకాలతో పూజలు చేస్తున్న మెగా అభిమానులు
X

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ కోసం మెగా అభిమానులు కళ్లు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా జూన్ 4న విడుదల కాబోతుండగా.. అప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా హాళ్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. మరీ ముఖ్యంగా రామ్ చరణ్‌కు ఏకంగా గుడి కట్టేశారు అభిమానులు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్ వద్ద మెగా ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. సాధారణంగా స్టార్ హీరోల చిత్రాల రిలీజ్ సమయంలో థియేటర్స్ వద్ద పెద్ద పెద్ద కటౌట్స్ దర్శనమిస్తుంటాయి. కానీ కూకట్‌పల్లిలో మాత్రం ఫ్యాన్స్ ఓ అడుగు ముందుకు వేసి ‘పెద్ది’ సినిమాలోని రామ్ చరణ్ క్యారెక్టర్‌ను పోలిన భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు.

దీనికి శ్రీ కొణెదెల రామ్ చరణ్ దేవాలయం అని ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇక ఈ రస్టిక్ లుక్‌ను అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ విగ్రహాన్ని చూసేందుకు జనాలు తరలిరావడంతో పాటు.. క్షీరభిషేకాలు, కర్పూర హారతులు ఇస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. దీంతో అక్కడ మొత్తం జాతర వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా.. ఇదెక్కడి క్రేజ్ రా మామా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న ‘పెద్ది’ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొన్ని గంటల్లోనే థియేటర్స్‌లోకి రాబోతుంది.

Next Story