- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ది తర్వాత స్మాల్ బ్రేక్! RC17 స్టార్ట్ అయ్యేది అప్పుడే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరికొద్ది గంటల్లో ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరికొద్ది గంటల్లో ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీను డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ట్రైలర్, గ్లింప్స్, టీజర్‌కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ చాట్ బాస్టర్ హిట్ అయ్యాయి. చరణ్ రగ్డ్ లుక్, విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇస్తుండగా.. థియేట్రర్స్‌లో ఎప్పుడెప్పుడు చుద్దామా అని వెయిట్ చేస్తున్నారు. జూన్ 4న గ్రాండ్ థియేట్రికల్‌కు వస్తుండగా.. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే RC17కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ‘పెద్ది’ ప్రమోషన్స్ తర్వాత చరణ్ షార్ట్ బ్రేక్ తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. పెద్ది ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న చరణ్ చేతికి కట్టుతో కనిపిస్తున్నాడు. ప్రమోషన్స్ అనంతరం చిన్న సర్జరీ కోసం రెస్ట్ తీసుకుని, రికవరీ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘RC17’పై ఫోకస్ పెట్టనున్నారట. అంటే ఈ సినిమా షూటింగ్‌పై జులైలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్. కాగా.. RC17 సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రస్తుతం ఆయన ఫైనల్ డ్రాఫ్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. దసరా తర్వాత సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉందని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి.
నో మోర్ వింటేజ్.. ఓన్లీ న్యూ ఏజ్.. ‘NBK-111’ నుంచి అదిరిపోయే అప్డేట్






