నో మోర్ వింటేజ్.. ఓన్లీ న్యూ ఏజ్.. ‘NBK-111’ నుంచి అదిరిపోయే అప్డేట్

by Chukka Sudharani |   (  Updated:2026-06-02 15:22:12  IST  )

నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చేసింది.

నో మోర్ వింటేజ్.. ఓన్లీ న్యూ ఏజ్.. ‘NBK-111’ నుంచి అదిరిపోయే అప్డేట్
X

దిశ, సినిమా: నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చేసింది. నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్ట్ ‘NBK-111’. అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ ఉన్న ఈ ప్రాజెక్టు నుంచి బాలకృష్ణ బర్త్‌డే స్పెషల్‌గా గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్ ఏదో ఒకటి రాబోతుంది అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సస్పెన్స్‌కు తెర దించుతూ NBK-111 కు సంబంధించిన అఫీషిల్ అప్డేట్ వదిలారు మేకర్స్. ఈ మేరకు జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఒక ‘ఎక్స్‌ప్లోసివ్ అప్‌డేట్’ రాబోతున్నట్లు తెలుపుతూ.. ‘నో మోర్ వింటేజ్.. ఓన్లీ న్యూ ఏజ్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. భారీ ఇనుప గొలుసులతో చుట్టబడిన 'NBK' అక్షరాలు, బుల్లెట్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా.. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు ఈ ప్రతిష్టాత్మక కమర్షియల్ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.

Next Story