తమిళనాడు సీఎం విజయ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్ చరణ్

by Pulgam srinivas |   (  Updated:2026-05-31 06:37:54  IST  )

తమిళనాడు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన విజయ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు రామ్ చరణ్.

తమిళనాడు సీఎం విజయ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్ చరణ్
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘పెద్ది’ సినిమా జూన్ 4వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం భారీ స్థాయిలో ప్రమోషన్లు నిర్వహిస్తోంది. అందులో భాగంగా రామ్ చరణ్ తాజాగా తమిళనాడులో జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలీవుడ్ స్టార్ నటుడు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి అయిన విజయ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రామ్ చరణ్ మాట్లాడుతూ.. “తమిళనాడు ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన విజయ్ గారికి హృదయపూర్వక అభినందనలు. తన కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని విజయవంతంగా ముందుకు సాగారు. ఆయనలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు” అని ప్రశంసించారు. ప్రస్తుతం విజయ్‌పై రామ్ చరణ్ చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

నాకు నిజాలు చెప్పే ధైర్యం కూడా లేదు.. ‘జన నాయగన్’ విడుదల ఆలస్యంపై హెచ్ వినోద్ షాకింగ్ కామెంట్స్!

Next Story