- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు నిజాలు చెప్పే ధైర్యం కూడా లేదు.. ‘జన నాయగన్’ విడుదల ఆలస్యంపై హెచ్ వినోద్ షాకింగ్ కామెంట్స్!
ఆ విషయం నా చేతుల్లో లేదు. మీకు అసలు నిజం చెప్పేంత ధైర్యం కూడా నాకు లేదు. ఒకవేళ నేను ధైర్యం చేసి నిజం చెప్పినా.. దాన్ని బయట ప్రపంచానికి పంచుకునే ధైర్యం మీకు ఉండదు.

దిశ, సినిమా: తమిళనాడు సీఎం, స్టార్ హీరో విజయ్ నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. మమిత మైజు, ప్రియమణి, బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించగా.. జనవరిలోనే విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడుతూ వస్తోంది. ఐదు నెలలుగా సెన్సార్ బోర్డ్ వద్దే ఆగిపోయింది. దీంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, దర్శకుడు పండిరాజ్ చిత్రం ‘పరిమళ & కో’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హెచ్. వినోద్‌కు ఈ సినిమా విడుదలపై ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. యాంకర్ వినోద్‌ను ప్రశ్నిస్తూ.. "ఈ ప్రశ్న ఇప్పటికే తమిళనాడు మొత్తం మిమ్మల్ని అడుగుతోంది, ఇప్పుడు నేనూ అడుగుతున్నాను.. ‘జన నాయకన్’ సినిమా విడుదల ఎప్పుడు ఉంటుంది?" అని అడిగారు. దానికి వినోద్ నవ్వుతూ సమాధానమిచ్చారు. "ఆ విషయం నా చేతుల్లో లేదు. మీకు అసలు నిజం చెప్పేంత ధైర్యం కూడా నాకు లేదు.
ఒకవేళ నేను ధైర్యం చేసి నిజం చెప్పినా.. దాన్ని బయట ప్రపంచానికి పంచుకునే ధైర్యం మీకు ఉండదు" అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు ‘జన నాయకన్’ చిత్రానికి ఏం జరుగుతోందనే విషయానికి వస్తే.. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్స్ ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయబోతున్నట్లు లిస్ట్ చేయడంతో జూన్ 22న విజయ్ 52వ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా రాబోతుందని ఫ్యాన్స్ ఎంతో ఆశపడ్డారు. కానీ ఈ చిత్ర నిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్స్ వెంకట్, తమిళనాడు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రాజ్‌మోహన్ ఆర్ముగం స్పందిస్తూ.. సెన్సార్ సర్టిఫికేట్ రాకుండా సినిమాను విడుదల చేయలేమని, దానికి సంబంధించిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని స్పష్టం చేశారు. రాజకీయ కారణాల వల్ల ఏ సినిమాను ఆపలేమని, చట్టబద్ధంగా సర్టిఫికేట్ వచ్చాకే విడుదల సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు. సెన్సార్ ఇబ్బందుల వల్ల విజయ్ చివరి సినిమా విడుదల ఇలా ఆలస్యం కావడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.






