Ram Charan: సినిమా ఫ్లాప్ అయితే అలా ఉంటాను

by Pulgam srinivas |   (  Updated:2026-05-22 08:34:19  IST  )

రామ్ చరణ్ మాట్లాడుతూ… సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా తాను ఒకేలా ఉంటానని చెప్పుకొచ్చారు.

Ram Charan: సినిమా ఫ్లాప్ అయితే అలా ఉంటాను
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరుత సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన ఆయన మగధీర చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకుని స్టార్ హీరోగా తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. ఆ తర్వాత కూడా అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. తాజాగా రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయాలు, అపజయాలపై తన దృక్పథాన్ని స్పష్టంగా వివరించారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ, తాను నటించిన సినిమా ఫ్లాప్ అయితే పెద్దగా టెన్షన్ పడనని, లో ఫేజ్‌లోకి వెళ్లనని చెప్పారు. అదే విధంగా సినిమా భారీ విజయం సాధించినప్పుడు కూడా అతిగా సంతోషపడనని తెలిపారు. ఎప్పుడూ తనను తాను బ్యాలెన్స్‌గా ఉంచుకోవడమే తన లక్ష్యమని చెప్పారు. రోజు ముగిసే సమయంలో ఆ రోజు గురించి ఆలోచించినప్పుడు సంతోషంగా అనిపిస్తే అదే తనకు నిజమైన సక్సెస్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ‘పెద్ది’ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు.

‘పెద్ది’లో ఏకంగా అంతమంది హీరోయిన్లు.. చివరి నిమిషంలో పెద్ద ట్విస్ట్

‘పెద్ది’ ఐటమ్ సాంగ్‌పై క్రేజీ అప్‌డేట్.. ఇక్కడ హిట్ అయితే అంచనాలు పీక్స్

Next Story