రజనీ కోసం హిట్ ఫార్ములా ఫిక్స్ చేసిన కమల్

by Pulgam srinivas |   (  Updated:2026-06-10 07:32:14  IST  )

‘తలైవర్ 173’ చిత్రంలో రజనీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

రజనీ కోసం హిట్ ఫార్ములా ఫిక్స్ చేసిన కమల్
X

దిశ, వెబ్ డెస్క్: లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. దీంతో ‘తలైవర్ 173’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా నటించనున్న ‘తలైవర్ 173’ చిత్రంలో రజనీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

అంతేకాకుండా ఇటీవల ఈ మూవీ బృందం రజనీకాంత్‌పై లుక్ టెస్ట్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. చాలా సంవత్సరాల క్రితం విడుదలైన ‘చంద్రముఖి’ చిత్రంలో రజనీకాంత్ సైకియాట్రిస్ట్ డాక్టర్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత రజనీ మళ్లీ డాక్టర్ పాత్రలో కనిపించలేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత మరోసారి డాక్టర్ పాత్రలో కనిపించనున్నాడనే వార్తలతో అభిమానులతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

‘డ్రాగన్’ శ్రీలంక షెడ్యూల్ అప్‌డేట్

Next Story