- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘డ్రాగన్’ శ్రీలంక షెడ్యూల్ అప్‌డేట్
‘డ్రాగన్’ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్‌ను శ్రీలంకలో వచ్చే నెల నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఆ వీడియో అద్భుతమైన స్పందనను దక్కించుకోవడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, మూవీ టీమ్ మరికొన్ని రోజుల్లో హైదరాబాద్‌లో ఓ చిన్న షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ పూర్తైన అనంతరం శ్రీలంకలో భారీ షెడ్యూల్ నిర్వహించనున్నట్లు సమాచారం. వచ్చే నెల నుంచి శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో తారక్‌తో పాటు పలువురు కీలక నటీనటులు పాల్గొననున్నారని సమాచారం. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, నందమూరి కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు.






