నిత్యవసర వస్తువులు ధరలు వెంటనే తగ్గించాలి: సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి

by Kodari Anjali |

నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నిత్యవసర వస్తువులు ధరలు వెంటనే తగ్గించాలి: సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్: నిత్యవసర వస్తువుల ధరలను పెంచి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిపిఐ వరంగల్, హనుమకొండ జిల్లా శాఖల ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ బృందం పోలీసులను తోసుకొని కలెక్టరేట్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులకు సిపిఐ నాయకులకు మధ్య వాగ్విద్వాదం చోటుచేసుకుంది.

నిత్యవసర సరుకుల ధరలు ఇలాగే కొనసాగితే...

ఈ సందర్భంగా తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో యుద్ధ వాతావరణం వల్ల ముడి చమురు రేట్లు పెరిగాయని సాకు చూపిస్తూ నిత్యవసరద వస్తువుల ధరలు పెంచితే పేదవారి జీవనం ఎలా కొనసాగాలని ప్రశ్నించారు. వంట గ్యాస్‌తో పాటు కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన చిన్న చిన్న వ్యాపారస్తులు ఉపాధి కోల్పోయి రోడ్డుమీద పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యవసర సరుకుల ధరలు ఇలాగే కొనసాగితే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి భాషా బోయిన సంతోష్, ప్రజా కళాకారుల డప్పు రవి, జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Next Story