- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీనాక్షినామినేషన్‍ను రిజెక్ట్ వెనుక రేవంత్ రెడ్డి అంటూ ప్రచారం.. పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు
నాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారనే దుష్ప్రచారంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర కోణం దాగి ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీ కాంగ్రెస్ సీరియస్ అయింది. ఈ మేరకు ఈ ప్రచారంపై ఇవాళ సీసీఎస్ పోలీసులకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్న తెలుగు స్క్రైబ్ తో పాటు ఇతర సోషల్ మీడియా హ్యాండిళ్లపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రచారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరనున్న ఎంపీ చామల రణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రతిష్ట, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా తెలుగు స్క్రైబ్ వ్యవహరించిందని తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి డిజిటల్ మౌత్ పీస్‍గా తెలుగు స్క్రైబ్ నడుస్తోందని ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డిపై అసత్య వార్తా కథనాలు వేసిన తెలుగు స్క్రైబ్ సోషల్ మీడియా హ్యాండిల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
చిచ్చు పెట్టిన మంత్రి కైలాష్:
అయితే మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ కావడానికి కారణమైన కీలక ఆధారాలను కాంగ్రెస్ నేతలే తమకు లీక్ చేశారని మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ వర్గీయ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ సొంత మనుషులే మాకు ఈ సమాచారాన్ని చేరవేశారని చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ కు వెన్నుపోటు పొడిచారంటూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అంటూ పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ పోస్టులు చేయగా దీనిపై ఎంపీ చామల కిరణ్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు.






