- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగులు..12 మంది మృతి
దక్షిణాఫ్రికాలోని క్లీవ్‌ల్యాండ్ మురికివాడలో 10 మందికి పైగా ఉన్న సాయుధ దుండగుల ముఠా జరిపిన కాల్పుల్లో 12 మంది మరణించగా, 9 మంది గాయపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: తుపాకులతో వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన దక్షిణాఫ్రికాలో (South Africa) క్లీవ్‌ల్యాండ్ పరిధిలోని జంపర్స్ ఇన్‌ఫార్మల్ సెటిల్‌మెంట్ (మురికివాడ) లో చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల ప్రకారం.. మంగళవారం రాత్రి సాయుధ దుండగుల ముఠా ఒకటి ఒక్కసారిగా విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఈ దారుణ అటాక్‌లో కనీసం 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారని సౌత్ ఆఫ్రికా పోలీసులు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యధిక హత్యల రేటు నమోదయ్యే దేశాలలో ఒకటిగా ఉన్న దక్షిణాఫ్రికాలో ఈ తాజా ఊచకోత తీవ్ర సంచలనం రేపింది.
ముఠాగా వచ్చి మారణహోమం..
పోలీసు కర్నల్ దిమకాత్సో నెవ్వుహుల్వి తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 10 మందికి పైగా ఉన్న సాయుధ దుండగుల ముఠా ఒక తెల్లటి టయోటా క్వాంటం వాహనంలో ఘటనా స్థలానికి చేరుకుంది. ఆ మురికివాడలోకి రెండు వేర్వేరు మార్గాల ద్వారా లోపలికి ప్రవేశించిన దుండగులు.. అక్కడ కనిపించిన వారిపై వేర్వేరు ప్రాంతాల్లో ఏకధాటిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. అనంతరం అదే వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ కాల్పుల్లో 8 మంది పురుషులు, 3 గురు మహిళలు ఘటనా స్థలంలోనే చనిపోగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ దారుణ మరణానికి గల అసలు కారణాలు (Motive) ఇంకా తెలియరాలేదని, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. రోజుకు సగటున 60 హత్యలు జరిగే దక్షిణాఫ్రికాలో.. ఇలాంటి ముఠాలను అదుపు చేయడం పోలీసు యంత్రాంగానికి పెద్ద సవాల్‌గా మారింది.






