వ్యవసాయ దుకాణాల్లో తహసీల్దార్, ఏవో, ఎస్సై సంయుక్త తనిఖీలు

by Kodari Anjali |

రైతులు కొనుగోలు చేసే విత్తనాలు, ఎరువులకు తప్పనిసరిగా రసీదు పొందాలని మండల వ్యవసాయ అధికారి కోర్ర రమేష్ నాయక్ తెలిపారు.

వ్యవసాయ దుకాణాల్లో తహసీల్దార్, ఏవో, ఎస్సై సంయుక్త తనిఖీలు
X

దిశ, ఉప్పునుంతల: రైతులు కొనుగోలు చేసే విత్తనాలు, ఎరువులకు తప్పనిసరిగా రసీదు పొందాలని మండల వ్యవసాయ అధికారి కోర్ర రమేష్ నాయక్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉప్పునుంతల మండల కేంద్రంలోని శ్రీ రామకృష్ణ ట్రేడర్స్‌లో తహసిల్దార్ సునీత, ఎస్సై మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. విత్తనాలు ఎరువుల నిల్వలు, లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్లు, విక్రయ రికార్డులు, ధరల పట్టికలు బిల్లుల జారీ విధానాన్ని వారు పరిశీలించారు. రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఇన్పుట్లు మాత్రమే విక్రయించాలని ప్రతి విక్రయానికి తప్పనిసరిగా రైతులకు బిల్లులు జారీ చేయాలని దుకాణ నిర్వాహకులకు వారు సూచించారు. అనుమతి లేని విత్తనాలు, ఎరువులు విక్రయించరాదని వ్యవసాయ శాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వారు తెలిపారు. నిబంధన ఉల్లంఘనకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. రైతులకు కొనుగోలు చేసే సమయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని వారు కోరారు.

Next Story