దేవర - 2పై నిర్మాత బిగ్ అప్‌డేట్‌.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-27 12:19:34  IST  )

టాలీవుడ్ లో సింగిల్ టేక్ హీరోగా పేరుతెచ్చుకున్న ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ హీరోగా ఎదిగారు.

దేవర - 2పై నిర్మాత బిగ్ అప్‌డేట్‌.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో సింగిల్ టేక్ హీరోగా పేరుతెచ్చుకున్న ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ హీరోగా ఎదిగారు. 2024లో దేవర సినిమాతో అభిమానులను ప్రేక్షకులను మెప్పించాడు తారక్. ఈ సినిమా క్లైమాక్స్ లో అసలు దేవర ఏమయ్యాడు అన్న సస్పెన్స్ ఉంటుంది. దాంతా సీక్వెల్ ఎప్పుడు ప్రకటిస్తారా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. తాజాగా.. దేవర-2 పై నిర్మాతల్లో ఒకరైన సుధాకర్ మిక్కిలినేని బిగ్ అప్డేట్ ఇచ్చారు. కొరటాల శివ డైరెక్షన్లో ఈ ఏడాది మే నెల నుంచి దేవర2 సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేశారు.

ఉమ్మడి కృష్ణాజిల్లా నందిగామలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుధాకర్ ను దేవర-2 ఉంటుందా లేదా అని అక్కడికి వచ్చినవారు అడిగారు. దీంతో దేవర 2 కచ్చితంగా తీస్తామని చెప్పారు. మే నెలలో షూటింగ్ మొదలవుతుందని, 2027లో సినిమాను విడుదల చేస్తామని అభిమానుల ముందు ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెట్టింట వరుస పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత దేవర -2 షూటింగ్ కు ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతా బాగుంటా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దేవర-2 ఉంటుందని అభిమానులు అంటున్నారు.

READ MORE ....

విడుదలకు సిద్ధమైన ‘స్కై’

Next Story