విడుదలకు సిద్ధమైన ‘స్కై’

by Sujitha Rachapalli |   (  Updated:2026-01-27 12:20:35  IST  )

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్‌టైన్మెంట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా ‘స్కై’.

విడుదలకు సిద్ధమైన ‘స్కై’
X

దిశ, సినిమా : మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్‌టైన్మెంట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా ‘స్కై’. పృథ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ‘స్కై’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్ మధ్య జరిగే సరదా సన్నివేశాలతో ట్రైలర్ మొదలవుతుంది. హీరో హీరోయిన్స్ మధ్య పరిచయం ప్రేమగా మారడం.. వారి ప్రేమలోని ఎమోషన్ ఆకట్టుకునేలా చిత్రీకరించారు. హీరోయిన్ క్యారెక్టర్ స్ట్రాంగ్‌గా డిజైన్ చేసినట్లు ట్రై‌లర్‌తో తెలుస్తోంది. హీరో పర్సనల్ లైఫ్ ప్లాష్ బ్యాక్ హార్ట్ టచింగ్‌గా ఉంది. కొన్ని అపార్థాలతో హీరో హీరోయిన్ ప్రేమలోనూ కొన్ని విబేధాలు వస్తాయి. ఈ జంట ఎలా తిరిగి ఒక్కటయ్యారు ? హీరో పర్సనల్ లైఫ్‌లో తండ్రితో ఉన్న ప్లాష్ బ్యాక్ ట్రాజెడీ ఏంటి? అనేది తెరపై చూడాలి.

READ MORE ....

దేవర - 2పై నిర్మాత బిగ్ అప్‌డేట్‌.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్

Next Story