- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Priyamani: ఆ సినిమా చేయడానికి కారణం ఒక్క ఫోటోనే.. ఆసక్తికర విషయాలు చెప్పిన ప్రియమణి
రామానాయుడు స్టూడియోలో తన ఫోటో ఉండాలని అనుకున్నానని, ఆ కోరిక ‘నారప్ప’ చిత్రంతో నెరవేరిందని ప్రియమణి తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ నటి ప్రియమణి ఇప్పటివరకు తెలుగుతో పాటు పలు భాషా చిత్రాల్లో నటించి, ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. కొంతకాలం క్రితం ఆమె విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘నారప్ప’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
ఆమె మాట్లాడుతూ… చాలా కాలం క్రితం రామానాయుడు స్టూడియోలో షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడ కొంతమంది నటీమణుల ఫోటోలను చూశానని, అప్పట్లో వాటి గురించి తనకు పెద్దగా తెలియదని చెప్పింది. తర్వాత అవి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నటించిన హీరోయిన్ల ఫోటోలు అని తెలిసిందని తెలిపింది. దాంతో అక్కడ తన ఫోటో కూడా ఉండాలని అప్పుడే అనుకున్నానని పేర్కొంది.
ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ‘నారప్ప’ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని, ఆ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు లభించిందని చెప్పింది. అలాగే సురేష్ ప్రొడక్షన్స్‌లో పనిచేయాలనే కోరిక కూడా నెరవేరిందని తెలిపింది. శ్రీకాంత్ అడ్డాల ఒక అద్భుతమైన దర్శకుడని, ‘నారప్ప’ చిత్రాన్ని చాలా గొప్పగా తెరకెక్కించారని ప్రశంసించింది. చివరగా రామానాయుడు స్టూడియోలో తన ఫోటో ఉండాలనే కోరిక ‘నారప్ప’ సినిమాతో నెరవేరిందని ప్రియమణి పేర్కొంది.






