- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మాతగా నా ప్రయాణం స్టార్ట్.. ఈ శుభతరుణంలో అంటూ నాగచైతన్య పోస్ట్
దూత-2 సిరీస్‌తో నిర్మాతగా తన ప్రయాణం స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించాడు అక్కినేని నాగచైతన్య.

దిశ, సినిమా: వరుస పరాజయాలతో సతమతమవుతున్న టైమ్‌లో ‘దూత’ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చి సాలిడ్ హిట్ అందుకున్నాడు అక్కినేని హీరో నాగచైతన్య. 2023 డిసెంబర్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో విడుదలై పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ సిరీస్‌కు ఇప్పుడు సీక్వెల్‌గా ‘దూత 2’ రాబోతున్నది. తాజాగా దీనికి సంబంధించిన పూజాకార్యక్రమాలు గ్రాండ్‌గా జరగగా.. అక్కినేని నాగార్జున క్లాప్ కొట్టి దీన్ని ప్రారంభించారు. ఇందులో మరో విశేషం ఏంటంటే.. ఈ దూత 2తో నాగచైతన్య నిర్మాతగా మారుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు పూజాకార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా పంచుకుంటూ.. ‘'దూత' రెండవ అధ్యాయంలోకి అడుగుపెడుతూ, నిర్మాతగా నా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న ఈ శుభ తరుణంలో.. ఇకపై అంతా ఉన్నతమైన పురోగతే.. ముందున్న అద్భుతమైన ప్రయాణానికి స్వాగతం’ అంటూ చెప్పుకొచాడు. కాగా.. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందిన హారర్ మిస్టరీ థ్రిల్లర్ ‘దూత’లో నాగచైతన్య జర్నలిస్ట్ సాగర్ వర్మ అవధూరిగా అందరిని ఆకట్టుకున్నాడు. దీంతో సాగర్ వర్మ మళ్లీ వచ్చేస్తున్నాడు అంటూ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన ఫొటోస్ ప్రస్తుతం వైరల్ అవుతూ అందరిని దృష్టిని ఆకర్షిస్తున్నాయి.






