- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దూత 2’ మొదలైంది.. నాగార్జున సమక్షంలో ఘనంగా పూజా కార్యక్రమం
నాగచైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘దూత 2’ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమం తాజాగా ఘనంగా జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘దూత’ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో నాగచైతన్యకు జోడీగా ప్రియ భవాని శంకర్ నటించగా, ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ థ్రిల్లర్ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సక్సెస్‌ఫుల్ సిరీస్‌కు కొనసాగింపుగా ‘దూత 2’ తెరకెక్కనుంది. తాజాగా ఈ సిరీస్ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించగా, ఆ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
నాగచైతన్య కెరీర్‌లో గుర్తుండిపోయే వెబ్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచిన ‘దూత’కు సీక్వెల్‌గా రానున్న ‘దూత 2’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సిరీస్‌తో నాగచైతన్య మరోసారి ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి. ప్రస్తుతం పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.






