- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
The Raja Saab: ‘రాజాసాబ్’ కు భారీ ధర... ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే ?
ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా సినిమా ది రాజాసాబ్. ఈ సినిమా జనవరి 8వ తేదీ నుంచి థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే, ఈ సినిమాపై మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్స్ వస్తోన్నట్లు టాక్ నడుస్తోంది. దీనికి తగ్గట్టుగానే, ఈ సినిమాకు మొదటి రోజున రూ.100కు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక మూడో రోజున ది రాజాసాబ్ సినిమా రూ.183 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమాలో అదనంగా సీన్లు యాడ్ చేయడంతో ఈ సినిమాకు కలెక్షన్స్ వస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ది రాజాసాబ్ ఓటీటీ అప్డేట్
ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఏకంగా రూ.160 కోట్లకు ఈ సినిమాను జియో హాట్ స్టార్ కొనుగోలు చేసిందట. ఇక ఈ సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందట. ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమాలో రిద్ది కుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు.
Read More..






