- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఓటీటీలో "మన శంకర వరప్రసాద్ గారు".. డేట్ కూడా ఫిక్స్ ?
మన శంకర వరప్రసాద్ గారు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ 5 సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ), నయన తార ( Nayana tara) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu ). ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఇవాళ రిలీజ్ అయింది. నిన్న రాత్రి ప్రీమియర్లు పడిపోయాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా రావడంతో పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే కథ జనాలకు బాగా నచ్చిందట. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. మొన్న రిలీజ్ అయిన ప్రభాస్ సినిమా ది రాజా సాబ్ కంటే చాలా బెటర్ అంటున్నారు సినిమా చూసినవాళ్లు. దీంతో మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన OTT అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మన శంకర వర ప్రసాద్ ఓటీటీ అప్డేట్ ఇదే?
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించిన మన శంకర వరప్రసాద్ గారు ( Mana Shankara Vara Prasad Garu OTT) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ 5 సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న నేపథ్యంలో భారీ ధరకు సొంతం చేసుకుందట జీ5. ఈ సినిమా ఇవాళ రిలీజ్ కాగా ఫిబ్రవరి చివరి వారంలో ఓటీటీలోకి రాబోతున్నట్లు చెబుతున్నారు. అంటే ఈ సినిమా OTTలోకి రావాలంటే ఆరు వారాల సమయం పడుతుంది.






