- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ తేదీ నుంచి ప్రారంభం కానున్న ‘పెద్ది’ ఐటమ్ సాంగ్
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన ఐటెం సాంగ్ చిత్రీకరణను ఏప్రిల్ 9వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం.

దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్‌గా కనిపించనుండగా, దర్శకుడు బుచ్చి బాబు సనా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తయినట్లు, ఒకే ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని రామ్ చరణ్ కొంతకాలం క్రితం వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఐటమ్ సాంగ్ మాత్రమే బ్యాలెన్స్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ ఐటమ్ సాంగ్ చిత్రీకరణను ఏప్రిల్ 9వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫి చేయనున్నట్లు సమాచారం. ఈ సాంగ్‌ను అత్యంత గ్రాండ్గా రూపొందించనున్నారని, సినిమాకి ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా, ఈ పాటలో హీరోయిన్ మృనాల్ ఠాకూర్ నటించే అవకాశాలు ఉన్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో ఈ అంశంపై ఆమెకు ప్రశ్న ఎదురైనా, దీనిపై స్పందించకుండా మౌనం పాటించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






