- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AA22xA6: షూటింగ్ కంప్లీట్ అయ్యేది అప్పుడే
ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం 'AA22xA6' చిత్రానికి సంబంధించిన అన్ని పనులు వచ్చే ఏడాది సమ్మర్ ప్రారంభం లేదా ముగింపు వరకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో దీపికా పదుకొణె ప్రధాన హీరోయిన్‌గా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్, అనుష్క శర్మ కీలక పాత్రల్లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఈ భారీ చిత్రానికి మేకర్స్ ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. అందువల్ల ప్రస్తుతం ‘AA22xA6’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు ఆయనకు అత్యంత సన్నిహితుడైన బన్నీ వాసు ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అనే ఆసక్తి బన్నీ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా నెలకొంది.
ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం, వచ్చే ఏడాది సమ్మర్ ప్రారంభం లేదా ముగింపు వరకు ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ టైంకి ఈ సినిమా పనులు పూర్తవడం కూడా పెద్ద విషయమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాలో భారీ స్థాయిలో గ్రాఫిక్స్ పనులు ఉండటమే. ఆ సమయానికి అన్ని వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేయడం ఒక పెద్ద సవాలుగా మారుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






