- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ కలెక్షన్ల వేళ ఊహించని వివాదంలో ‘పెద్ది’.. హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్!
ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద ఆర్టిస్టులు, పేరున్న వాళ్లు ఇప్పటికీ జానీ మాస్టర్‌తో కలిసి పనిచేయడం, అవకాశాలు ఇవ్వడం చాలా బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబోలో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘పెద్ది’ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్నప్పటికీ వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇందులో జాన్వీ కపూర్‌ను గ్లామర్ డాల్‌లా చూపించారంటూ దారుణమైన విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఆమె పాత్రకు ప్రాధాన్యత ఇవ్వకుండా హీరో క్యారెక్టర్‌ను మాత్రం బాగా చూపించారని వాదన ఉంది. దీంతో బుచ్చిబాబు సనా క్షమాపణలు చెప్పడంతో పాటుగా.. జాన్వీ కపూర్ స్కిన్ షోకు సంబంధించిన సీన్స్‌ను తొలగించేశారు. ఈక్రమంలోనే.. మేకప్ ఆర్టిస్ట్ సావ్లీన్ కౌర్ మరో విషయాన్ని తెరపైకి తేవడంతో ‘పెద్ది’పై ట్రోలింగ్ జరుగుతోంది. జాన్వీ ముందే బోల్డ్ సీన్లు వద్దని చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు వినలేదని చెప్పడం గమనార్హం. రూ.300కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టుకున్న ‘పెద్ది’ బాక్సాఫీసు వద్ద పలు రికార్డులు తిరగరాస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా, ‘పెద్ది’ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. శ్రష్టి వర్మ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ జానీ మాస్టర్‌కు ‘పెద్ది’లో చాన్స్ ఇవ్వడంపై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంచలన పోస్ట్ పెట్టింది.
తనపై జరిగిన లైంగిక వేధింపుల విషయంలో జానీ మాస్టర్‌పై ఉన్న ‘పోక్సో’ (POCSO) కేసులో తానే మెయిన్ కంప్లైంట్ దారుడినని.. ఈ కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉందని చెప్పారు. ఇంత పెద్ద ఆరోపణలు ఉండి, ఇండస్ట్రీకి చెందిన ‘పోష్’ కమిటీ విచారణలో కూడా నిజాలు తెలిసినప్పటికీ.. ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద ఆర్టిస్టులు, పేరున్న వాళ్లు ఇప్పటికీ ఆయనతో కలిసి పనిచేయడం, అవకాశాలు ఇవ్వడం చాలా బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి చూస్తుంటే తనకు చాలా నిరాశగా, ఆందోళనగా ఉందని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్లకు రక్షణ, బాధ్యత ఉండాలని శ్రష్టి వర్మ డిమాండ్ చేశారు. ఇలాంటి తప్పులు చేసిన వారి విషయంలో ఇండస్ట్రీ కఠినంగా ఉండాలని, బాధితుల వైపు నిలబడాలని కోరారు. శ్రష్టి వర్మ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అంత పెద్ద కేసులో ఉన్నవారితో పెద్ద పెద్ద హీరోలు, ప్రొడక్షన్ హౌస్‌లు ఎలా సినిమాలు చేస్తాయనే ప్రశ్నలు మళ్లీ మొదలయ్యాయి. ‘పెద్ది’ మూవీ బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు సాధిస్తున్న ఈ టైమ్‌లో, జానీ మాస్టర్ వల్ల వచ్చిన ఈ కొత్త వివాదం పెద్ద చర్చకు దారితీసింది.
నేనేం పాపం చేశానని వరుస కష్టాలు చుట్టుముడుతున్నాయి.. శ్రీజ ఎమోషనల్ పోస్ట్






