అత్యధిక కాలం పీఎమ్‌గా మోడీ.. శాలువాతో సత్కరించిన చంద్రబాబు, పవన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-10 13:06:22  IST  )

దేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పని చేసిన వ్యక్తిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించారు. అంతేకాకుండా NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది...

అత్యధిక కాలం పీఎమ్‌గా మోడీ.. శాలువాతో సత్కరించిన చంద్రబాబు, పవన్
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రి(Prime Minister)గా పని చేసిన వ్యక్తిగా నరేంద్ర మోడీ(Narendra Modi) రికార్డు సృష్టించారు. అంతేకాకుండా NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీ(Delhi)లో ఆయా పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) హాజరయ్యారు. ఈ పన్నెండేళ్ల కాలంలో ఎన్టీఏ పార్టీ సాధించిన విజయాలు, అపజయాలు, కీలక ఘట్టాలు, జరిగిన పరిమాణాలను గుర్తు చేసుకుని సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి ముందు నరేంద్ర మోదీని చంద్రబాబు, పవన్ కల్యాణ్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలో సుదీర్ఘకాలం ప్రధానిగా రికార్డు సృష్టించడంపై అభినందలు చెప్పారు.

Next Story