- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కౌన్సిలర్లు నాయకులు ప్రజల్లో మమేకమై సేవలందించాలి : ఎమ్మెల్యే విజయరమణ రావు
పార్టీ నాయకులు, కౌన్సిలర్లు ప్రజలతో మమేకమై సేవలందించాలని విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు.

దిశ, సుల్తానాబాద్ : పార్టీ నాయకులు, కౌన్సిలర్లు ప్రజలతో మమేకమై సేవలందించాలని విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 1, 13, 14, 15 వార్డులకు సంబంధించిన వార్డు సభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు. వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, నాళాలు ఎప్పటికప్పుడు శుభ్ర పరచుకోవాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తాను త్వరలోనే వార్డుల బాట పడతానని తెలిపారు. ఆయా వార్డుల్లో త్వరలోనే సిసి రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం అవుతాయన్నారు.
రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామని స్పష్టం చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ఎలాంటి కటింగులు లేకుండా అనేక సమస్యలను అధిగమిస్తూ కొనుగోళ్లు పూర్తిచేసి, రైతుల సేవలో తరించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మన్నలను పొందుతుండగా.. బీఆర్ఎస్ ఓరువలేకపోతుందని అన్నారు. ప్రతిపక్షాల ధర్నాలకు రైతులు రావడంలేదని స్వయంగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొనడం కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.






