- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేనేం పాపం చేశానని వరుస కష్టాలు చుట్టుముడుతున్నాయి.. శ్రీజ ఎమోషనల్ పోస్ట్
మన జీవితం ఎందుకు ఇలా ఉంది అని బాధపడటానికి బదులుగా, ఆ పరిస్థితిని మార్చుకోవడానికి మనమేం చేయగలమనే విషయాన్ని తెలుసుకోవడమే అసలైన మార్పు అని శ్రీజ వివరించారు.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశారు. 2007లో శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ కూతురు పుట్టాక మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. 2016లో మళ్లీ నటుడు కల్యాణ్ దేవ్‌ను రెండో పెళ్లి చేసుకోగా.. మరోసారి కూతురు జన్మించింది. కానీ వీరి కాపురం సవ్యంగా సాగలేదు. 2022లో విడాకులు తీసుకుని విడిపోయారు. విడాకులతో నిత్యం వార్తల్లో నిలిచిన శ్రీజ.. మొత్తానికి అన్నింటికీ దూరం అయి ప్రస్తుతం తన పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నారు. ఇన్నాళ్లకు మళ్లీ తాను అనుభవిస్తున్న బాధను బయటపెడుతూ ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేసి వార్తల్లో నిలిచారు. మొత్తానికి తను బాధల నుంచి బయటకు ఎలా వచ్చిందో వివరిస్తూ.. అసలు నాకే ఎందుకిలా జరుగుతోందని, నేనేం పాపం చేశానని ఇంత క్షోభ అనుభవిస్తున్నానని చాలా కాలం నాలో నేను బాధపడ్డానని ఆమె తెలిపారు. ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు చుట్టుముడుతున్నప్పుడు ఎంతో మదనపడ్డానని, కానీ రాను రాను ఆ బాధ నుంచి నెమ్మదిగా బయటకు వచ్చానని చెప్పారు.
మన జీవితం ఎందుకు ఇలా ఉంది అని బాధపడటానికి బదులుగా, ఆ పరిస్థితిని మార్చుకోవడానికి మనమేం చేయగలమనే విషయాన్ని తెలుసుకోవడమే అసలైన మార్పు అని శ్రీజ వివరించారు. తనలో వచ్చిన మార్పు గురించి చెబుతూ.. సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్ వల్ల తన ఆలోచనల్లో మంచి క్లారిటీ వచ్చిందని, జీవితం ఎంతో ప్రశాంతంగా మారిందని పేర్కొన్నారు. అసలు తనేంటో తనకు తెలిసిందని చెప్పారు. ఒకప్పుడు తన లైఫ్‌లో జరిగిన తప్పులే తన గుర్తింపును నిర్ధారిస్తాయని అనుకున్నానని, కానీ అది ఎంతమాత్రం నిజం కాదని తెలుసుకున్నానని వివరించారు. బాధ అనేది తనలో ఒక భాగం మాత్రమేనని, కానీ అదే జీవితం కాదని ఆ తర్వాత అర్థమైందని చెప్పుకొచ్చారు. మనిషిలో ఇంకా ఎన్నో లేయర్స్ ఉంటాయని, వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకోవడం ఎంతో బాగుందని శ్రీజ అభిప్రాయపడ్డారు. ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడిన ఆమె ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నిజంగా చాలా గ్రేట్ అని, ఎంతో మందికి ఇదొక మంచి ఇన్స్పిరేషన్ సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.






