- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రజనీకాంత్‌లా అవ్వాలనుకుని మూర్ఖుడినయ్యా.. అది నా ముఖం వాచేలా మంచి గుణపాఠం నేర్పింది: ఆర్ మాధవన్
నేను అలా చేయకుండా ఉండాల్సింది. వాళ్లు చెప్పింది వినేసి బీ, సీ సెంటర్ల సినిమాలు చేసేయకూడదని అర్థమైంది. ఆ మూవీ నా ముఖం వాచేలా మంచి గుణపాఠం నేర్పింది

దిశ, సినిమా: వైవిధ్యమైన కథలు, పాత్రలతో అలరిస్తున్న ఆర్ మాధవన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. ఇటీవల వచ్చిన ‘ధురంధర్-2’తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం మాధవన్ ‘జిడిఎన్’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఎడిసన్ ఆఫ్ ఇండియా, మిరాకిల్ మ్యాన్‌గా పేరొందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గోపాలస్వామి దొరైస్వామి నాయుడు జీవిత కథ ఆధారంగా రాబోతోంది. కృష్టకుమార్ రామకుమార్ తెరకెక్కిస్తుండగా.. ఇందులో దుషారా విజయన్, సత్యరాజ్, ప్రియమణి, యోగిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా జూలై 17న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవన్ తనకు ఎదరైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. రజనీకాంత్‌లా సూపర్‌స్టార్ అవ్వాలనుకుని మూర్ఖుడిని అయ్యానని తెలుపుతూ.. ‘‘ఒకానొక సమయంలో కొందరు నా దగ్గరకు ఒక డేటాతో వచ్చారు. అదేంటంటే.. ‘బి, సి సెంటర్‌లలోని ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు చేయకపోతే, మీరు రజనీకాంత్ కాలేరు.
గ్రామీణ ప్రేక్షకులకు మిమ్మల్ని ఆదరించినప్పుడే మీరు తలైవా కాగలరు’ అని అన్నారు. మాస్‌ను ఆకట్టుకునేలా చిత్రాలు చేస్తే ఎలా ఉంటుందా? నేను కూడా ఆలోచనలో పడ్డా. ఇలాంటి సలహాలను పరిగణనలోకి తీసుకుని నాకు సరిపోయే కథకు ఓకే చెప్పాను. అందులో నా పాత్ర చాలా బలహీనమైనది. తనని తాను పోషించుకోవడానికి కూడా ఎంతో కష్టపడేలా ఉంటుంది.. పైగా చదువు రాదు. అయినా కూడా గొప్ప క్రికెటర్ అవ్వాలన్నది ఆ యువకుడి కల. మాస్ అంశాలను మేళవించి ఈ కథతో మూవీ చేశా. తీరా చూస్తే ఫ్లాప్ అయింది. ఆ దెబ్బకు సినిమానే కాదు, మొత్తం స్టూడియోనే మూతబడిపోయింది. ఆ ఫ్లాప్‌తో నా కళ్లు తెరుచుకున్నాయి. అప్పుడు నాకో విషయం అర్థమైంది. వేరే వాళ్లు ఇచ్చే సమాచారం ఆధారంగా మూర్ఖులు చేసినట్లు పనులు చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలిసింది. ప్రతి ఒక్కరికీ ఏం చేయాలి? ఏం చేయకూడదన్న దానిపై సమాచారం ఉంటుంది. అందుకు తగినట్లు నడుకుంటూ ముందుకు వెళ్తేనే విజయానికి సరైన నిర్వచనం ఇవ్వగలం. వాళ్లు చెప్పింది కరెక్టే కావచ్చు. కానీ, నేను అలా చేయకుండా ఉండాల్సింది. వాళ్లు చెప్పింది వినేసి బీ, సీ సెంటర్ల సినిమాలు చేసేయకూడదని అర్థమైంది. ఆ మూవీ నా ముఖం వాచేలా మంచి గుణపాఠం నేర్పింది’’ అని మాధవన్ చెప్పుకొచ్చారు.






