- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుప్పకూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్.. 21 మంది భద్రతా సిబ్బంది దుర్మరణం
పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ మిలిటరీ హెలికాప్టర్ ఎంఐ-17 ఘోర ప్రమాదానికి గురైంది.

దిశ, వెబ్‌డెస్క్: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో తీవ్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, ఘర్షణలు తారా స్థాయికి చేరిన నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు వెళ్లిన పాక్ మిలిటరీ హెలికాప్టర్ MI-17 ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 21 మంది పాకిస్తాన్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా పీవోకే పరిధిలోని ముజఫరాబాద్, మీర్‌పూర్ ప్రాంతాల్లో నిత్యావసర ధరల పెరుగుదల, పన్నుల విధింపునకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటికే పలువురు మరణించగా, వందలాది మంది గాయపడ్డారు.
ఈ క్రమంలోనే పరిస్థితిని అదుపు చేయడానికి, భద్రతా బలగాలను తరలించడానికి రంగంలోకి దిగిన పాక్ ఆర్మీ హెలికాప్టర్, సాంకేతిక లోపం కారణంగా కూలిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో సామర్థ్యానికి మించి సిబ్బంది ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘటనపై పాకిస్తాన్ సైనిక విభాగం (ISPR) విచారణకు ఆదేశించింది.






