- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నర్వ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాపు నిర్వహణ
మండల కేంద్రంలో ఉన్న శ్రీ భవాని వైన్స్ లో వసతులు లేక మందుబాబులు ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, నర్వ : మండల కేంద్రంలో ఉన్న శ్రీ భవాని వైన్స్ లో వసతులు లేక మందుబాబులు ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము డబ్బులు చెల్లించి మద్యం కొనుగోలు చేస్తున్నాం. కానీ కూర్చోవడానికి కుర్చీలు, టేబుల్స్ కూడా లేవు. నేలపై కూర్చొని మద్యం సేవించడం జరుగుతుంది. కనీస వసతులు కల్పించాలి అని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండకు, వానకు ఎంతో ఖరీదైన మందును కొని ఆరుబయట మద్యం సేవించడం జరుగుతుందని పేర్కొంటున్నారు మద్యం ప్రియులు. ఫర్మిట్ రూములు లేక పక్కలో ఉండే కిరాయి సెటర్లో సిట్టింగ్ వేస్తే.. అధిక ధరలకు స్నాక్స్ ఇవ్వడం జరుగుతుందని వాపోతున్నారు. ఆరు బయటకు కూర్చుంటే పోలీస్ వాళ్ళు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మాపై కేసులు పెట్టి బైకులు సీజ్ చేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైన్స్ చుట్టుపక్కల అశుభ్రతతతో ఉంటుంది. దుర్వాసన వెదజల్లడం, చెత్త, చెదారం మధ్యలో కూర్చొని మద్యం సేవించడం జరుగుతుంది. ఇంతటి దుర్భార స్థితి ఎక్కడ చూడలేదని పేర్కొంటున్నారు స్థానికులు. ఎక్కడ కూర్చోవాలో అర్థం కాక ఎండలో కూర్చోవడం జరుగుతుందని.. ఫ్యాన్లు లేక ఉక్క పొతతొ బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకుపోయి సిట్టింగ్ రూమ్ లు ఏర్పాటు చేయాలని వాపోతున్నారు. యాంకీ రోడ్డుకు ఆనుకొని ఉన్న వైన్స్ సాయంత్రం పూట వాహనాలు పోవాలన్న రోడ్డుకు విరువైపులా వాహనాలు నిలపడం వలన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. రోడ్డుకు ఇరువైపులా స్నాక్స్ బండ్లు, కారా, పల్లీలు వంటి బండ్లు నిలపడం వల్ల వస్తూ పోయే ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు ఇబ్బందుల గురవుతున్నామని వాపోతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వైన్స్ సిబ్బంది సిట్టింగ్ రూమ్ లు ఏర్పాటు చేయాలని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






