ఆదిలాబాద్ డిఎంహెచ్ఓగా డా.సాధన బాధ్యతలు..

by Taduka Kalyani |

ఆదిలాబాద్ జిల్లా నూతన వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డా.సాధన బాధ్యతలు స్వీకరించారు.

ఆదిలాబాద్ డిఎంహెచ్ఓగా డా.సాధన బాధ్యతలు..
X

దిశ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా నూతన వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డా.సాధన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బుధవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా డా.సాధనకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు.జిల్లాలో వైద్య ఆరోగ్య సేవల మెరుగుదల,ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న సేవలు,ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాల కల్పనపై ఇరువురు చర్చించారు.ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు.ముఖ్యంగా వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, గ్రామాలు,పట్టణాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేసి ప్రజలకు సత్వర వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

Next Story