విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి..

by Taduka Kalyani |

మఠంపల్లి మండల పరిధిలోని లాలి తండా గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న ఓ యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు.

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి..
X

దిశ, మఠంపల్లి : మఠంపల్లి మండల పరిధిలోని లాలి తండా గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న ఓ యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. గ్రామానికి చెందిన బానోతు భీముడు (28), తండ్రి పాచ్చు, తన ఇంటిని రీ మోడల్ చేస్తున్న క్రమంలో గోడలకు వాటర్ క్యూరింగ్ చేయడానికి ఇంట్లో ఉన్న నీటి మోటార్‌ను ఆన్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే మోటార్ పనిచేయకపోవడంతో దానిని పరిశీలించేందుకు దగ్గరికి వెళ్లగా, ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలిపోయాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే భీముడిని చికిత్స నిమిత్తం హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే అతను మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.యువకుడి ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాద చోటుచేసుకుంది.

Next Story