- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు ఆసుపత్రులు
అభం శుభం తెలియని గ్రామీణ ప్రాంతాల ప్రజలు అనారోగ్యానికి గురై నారాయణపేట పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రులను సంప్రదిస్తే.. పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న అవగాహన లేని వైద్యులు అన్ని తెలిసినట్టుగా వ్యవహరిస్తూ పైసల కోసం కక్కుర్తిగా అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

దిశ, నారాయణపేట ప్రతినిధి : అభం శుభం తెలియని గ్రామీణ ప్రాంతాల ప్రజలు అనారోగ్యానికి గురై నారాయణపేట పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రులను సంప్రదిస్తే.. పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న అవగాహన లేని వైద్యులు అన్ని తెలిసినట్టుగా వ్యవహరిస్తూ పైసల కోసం కక్కుర్తిగా అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పట్టణంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కు గర్భిణీ స్త్రీలు ప్రసవం కోసం నారాయణపేట పట్టణంలో ప్రైవేట్ వైద్యులను సంప్రదించి వేలకు వేలు ఫీజులు ప్యాకేజీలు చెల్లించి తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. పలుమార్లు వివాదాల్లో ఒక ప్రైవేట్ ఆస్పత్రి పైసలే పరమావధిగా భావించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. సోమవారం ఓ నిండుగర్భిణీ ప్రసవం కోసం ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా.. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీకి అన్ని తామే చూసుకుంటామని సిజేరియన్ చేసిన వైద్యులు కడుపులో ఉన్న బిడ్డను కాపాడినప్పటికీ తల్లి ప్రాణాలను కాపాడలేక వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నారాయణపేట పట్టణంలో సంచలనంగా మారింది.
ఈ ఆస్పత్రిలో చాలా మంది వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయినప్పటికీ.. ఆ ఆస్పత్రి యాజమాన్యం మృతుల కుటుంబాలతో బేరా సారాలకు దిగడం, వినకపోతే మృతి చెందిన కుటుంబాలను భయపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అడ్డుకుని ఆటంకాలు సృష్టించి ప్రాణాలకు వేల కట్టడం పరిపాటిగా మారింది. నారాయణపేట పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆడిందే ఆట పాడిందు పాటగా ఇష్టానుసారంగా ఫీజులు అవసరంలేని వైద్య పరీక్షలు, డబ్బులు వసూలు చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అవగాహన లేని వైద్యులు డబ్బే లక్ష్యంగా కార్పొరేట్ స్థాయిలో ప్రైవేటు ఆసుపత్రులను సుందరీకరణ చేసి పట్టణ ప్రాంతాల నుంచి అనుభవజ్ఞులైన వైద్యుల పేర్లను తమ ఆసుపత్రుల్లో బోర్డులుపై నమోదు చేయడం వచ్చే రోగులకు భ్రమ కల్పించడం అవగాహన కలిగిన వైద్యులు అందుబాటులో లేక అందుబాటులో ఉన్న వైద్యులు సిబ్బందిచే వైద్యం చేయడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు బహాటంగానే ఆరోపిస్తున్నారు. సోమవారం జరిగిన నారాయణపేటమండలం లోని బొమ్మన్ పడ్ గ్రామానికి చెందిన ఓ యువతి నిండు గర్భిణి మృతి చెందిన ఘటనలో ప్రైవేట్ ఆసుపత్రి ముందు వైద్యుల నిర్లక్ష్యం వల్లనే నిండు గర్భిణీ మృతి చెందినదని కుటుంబ సభ్యులు రాత్రి మూడున్నర గంటల వరకు ఆందోళనకు దిగారు.
ప్రైవేట్ యాజమాన్యాలపెద్దలు కొంతమంది 9:30 లక్షలకు ఒక నిండు గర్భిణీ ప్రాణానికి వెలకట్టడం పట్టణంలో జోరుగా చర్చ కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆర్ఎంపీలకు పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రులు కమిషన్లను ఆశ చూపి తమ ఆసుపత్రులకే పంపాలని కమీషన్ల ప్రకృతి కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ వైద్యులు అనుభవాలు లేక అరకోర వైద్యం తెలిసిన ఆస్పత్రులకు పంపడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టు సమాచారం. ఇంత జరిగినా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆస్పత్రులపై పర్యవేక్షణ కొరవడి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతుల కుటుంబాలు ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన ఘటనలను కనీసం ఫిర్యాదు చేయడానికి కూడా వెనకాడుతున్నట్టు సమాచారం. ఈ ఘటన జరిగిన వెంటనే రాజకీయ నాయకుల అండదండలు ప్రైవేట్ ఆస్పత్రుల పెద్దలు రంగంలోకి దిగి రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టడం ఎంతవరకు సమంజసమని స్తానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆస్పత్రులపై అవగాహన లేని వైద్యులపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణ చేసి అవగాహన లేని వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.






