ప్రతి ఇంటి నుంచి రోడ్ సేఫ్టీ ప్రారంభం కావాలి.. ఐజీ షానవాజ్ ఖాసీం

by Batti.Sumithra |

ప్రజలు ప్రతి ఒక్కరూ రోడ్ సేఫ్టీ పై అవగాహన కలిగి ఉన్నప్పుడే ప్రమాదాలను నివారించవచ్చునని ఐజి షా నవాజ్ ఖాసిం తెలిపారు.

ప్రతి ఇంటి నుంచి రోడ్ సేఫ్టీ ప్రారంభం కావాలి.. ఐజీ షానవాజ్ ఖాసీం
X

దిశ, వికారాబాద్ ప్రతినిధి : ప్రజలు ప్రతి ఒక్కరూ రోడ్ సేఫ్టీ పై అవగాహన కలిగి ఉన్నప్పుడే ప్రమాదాలను నివారించవచ్చునని ఐజి షా నవాజ్ ఖాసిం తెలిపారు. బుధవారం నవాబుపేట మండల కేంద్రంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్ సేఫ్టీ పై జిల్లా ఎస్పీ స్నేహమేర ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఇంటి నుంచి రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చునని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి నిండు ప్రాణాలను కాపాడుకొని కుటుంబానికి రక్షణగా నిలవాలని అన్నారు. ద్విచక్ర వాహనదారులతో పాటు ఫోర్ వీలర్స్ కూడా తప్పనిసరిగా రోడ్డు నియమాలను పాటించినట్లయితే ప్రమాదాలను నివారించవచ్చునని తెలిపారు.

మనకు ప్రాణం దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందని ప్రతి ఒక్కరూ రోడ్డు సేఫ్టీ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రాణం అంటే లెక్క లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. వారు నిర్లక్ష్యం వహించడమే కాకుండా ముందు నుంచి వచ్చే వారి ప్రాణాలను తీసిన వారు అవుతున్నారని తప్పనిసరిగా రోడ్డు నియమాలు పాటించాలన్నారు. గ్రామ సర్పంచ్లు నో హెల్మెట్ నో ఎంట్రీ పై అవగాహన కల్పించాలి అని తెలిపారు. హెల్మెట్ లేకపోతే ఊరు సరిహద్దుల్లో నుంచి వెళ్ళనివ్వమని వాహనదారులకు సూచించాలని తెలిపారు. రోడ్ సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి సహకరించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో మోమిన్పేట్ సీఐ వెంకట్ ఎస్సైలు పోలీస్ సిబ్బంది ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Next Story