- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీఓ బిల్డింగ్స్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి : కలెక్టర్ చిత్రా మిశ్రా
జిల్లాలో వీఓ బిల్డింగుల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడంతో పాటు ఉపాధి హామీ కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : జిల్లాలో వీఓ బిల్డింగుల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడంతో పాటు ఉపాధి హామీ కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పనులు, వీఓ బిల్డింగుల నిర్మాణం, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం అమలు, కిశోర బాలికల సంఘాల ఏర్పాటు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల స్థాపన తదితర అంశాలపై ఎంపీడీవోలు, జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వివో బిల్డింగుల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో వేగవంతంగా అమలు చేయాలని సూచించారు. నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంకుల స్థాపనకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని, మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద మరిన్ని పనులను గుర్తించి గ్రామీణ కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, పూర్తయిన ఇళ్లకు వెంటనే ప్రొసీడింగ్స్ అందించాలని, కొత్తగా మంజూరైన ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం గురించి గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి అర్హులైన కుటుంబాలు పథకం ప్రయోజనాలు పొందేలా చూడాలని తెలిపారు. సమీక్షకు వచ్చిన అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కలెక్టర్, లక్ష్యాల సాధనకు శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, ఇన్‌చార్జి జెడ్పీ సీఈవో పవన్ కుమార్, డీఆర్‌డీఓ గీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.






