విశాఖ బీచ్‌లో యువకుడు గల్లంతు.. మృతదేహం లభ్యం

by Vemula.Srinu Prasad |

విశాఖ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతైన యువకుడు మన్ కుమార్ (19) మృతదేహం బుధవారం సాయంత్రం సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. కొన్ని రోజులుగా యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు..

విశాఖ బీచ్‌లో యువకుడు గల్లంతు.. మృతదేహం లభ్యం
X

దిశ విశాఖపట్నం: విశాఖ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతైన యువకుడు మన్ కుమార్ (19) మృతదేహం బుధవారం సాయంత్రం సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. కొన్ని రోజులుగా యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. వుడా పార్కు వెనుక సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న త్రీ టౌన్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు అది మన్ కుమార్ మృతదేహమేనని గుర్తించి నిర్ధారించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం పోస్టుమార్టం కోసం కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్) మార్చురీకి తరలించారు. త్రీ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story