ఒంటరితనం భరించలేక వ్యక్తి ఆత్మహత్య

by Taduka Kalyani |

గత 20 సంవత్సరాల క్రితం భార్య మరణించగా ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఆయనను వదిలి ఇతర దేశాలకు వెళ్లడంతో ఒంటరితనాన్ని భరించలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది.

ఒంటరితనం భరించలేక వ్యక్తి ఆత్మహత్య
X

దిశ,లోకేశ్వరం: గత 20 సంవత్సరాల క్రితం భార్య మరణించగా ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఆయనను వదిలి ఇతర దేశాలకు వెళ్లడంతో ఒంటరితనాన్ని భరించలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది. మండలంలోని రాజూరా గ్రామానికి చెందిన తమ్మరాసి పెద్ద రాజన్న (54) భార్య గతంలో మరణించగా కొడుకు సైతం ఉపాధి కోసం ఇతర దేశానికి వెళ్లగా నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. దీంతో ఇంటి నిర్మాణానికి అప్పులు కావడం ఒంటరి జీవితాన్ని భరించలేక మానసిక ఒత్తిడికి లోనై మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వివరించారు.

Next Story