- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.రెండు వేల పంచాయితీ.. పగిలిన పోలీస్ వాహనం అద్దాలు..!
రూ. రెండు వేల కోసం జరిగిన పంచాయితీలో పోలీస్ వాహనం అద్దాలు పగిలిన అనూహ్య సంఘటన వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది.

దిశ, వేములవాడ : రూ. రెండు వేల కోసం జరిగిన పంచాయితీలో పోలీస్ వాహనం అద్దాలు పగిలిన అనూహ్య సంఘటన వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లికి చెందిన ఓ మహిళ తాను కష్టపడి పని చేసిన పనికి గుత్తేదారు డబ్బులు ఇవ్వడం లేదని, అతని నుంచి తనకు వచ్చే రూ.2వేలు ఇప్పించాలని బుధవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు చివరకి గుత్తేదారు నుంచి సదరు మహిళకు వెయ్యి రూపాయలు ఇప్పించేలా సర్దుబాటు చర్యలు చేపట్టారు.
తాను ఎంతో కష్టపడి చేసిన పనికి వెయ్యి రూపాయలు మాత్రమే ఇప్పిస్తామని చెబుతున్నారంటూ కోపోద్రిక్తురాలైన మహిళ పోలీసులపై దాడికి యత్నించింది. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది అడ్డుకొని మందలించగా.. మరింత రెచ్చిపోయిన మహిళ చేతిలో రాయి పట్టుకొని సీఐ వీర ప్రసాద్ పైకి విసిరే ప్రయత్నం చేసింది. మహిళను ప్రతిఘటించిన సిబ్బంది పక్కనే ఉన్న గదిలోనికి తీసుకువెళ్లారు. అయినప్పటికి సదరు మహిళ మళ్లీ బయటకు వచ్చి తనను పోలీసులు కొడుతున్నారు అంటూ కేకలు వేస్తూ బయటకి వచ్చి స్టేషన్ ముందుబాగంలో ఉన్న పోలీస్ ఇన్నోవా వాహనంపై దాడి చేసింది. ఈ దాడిలో కారు అద్దం స్వల్పంగా దెబ్బతింది. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న పోలీసులు దాడి చేసిన మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా కేవలం రూ.2వేల కొరకు జరిగిన పంచాయితీలో సుమారు రూ.20వేలు విలువ చేసే పోలీస్ ఇన్నోవా వాహనం అద్దం పగలడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.






