- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనింగ్‌లో సింగరేణి సరికొత్త మైలురాయి: పర్యావరణ ప్రమాణాలపై కేంద్రం ప్రశంసలు
సుస్థిర మైనింగ్, పర్యావరణ ప్రమాణాల అమలులో సింగరేణి సరికొత్త మైలురాయిని అందుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: పర్యావరణ పరిరక్షణ, సుస్థిర మైనింగ్ విధానాల అమలులో సింగరేణి (Singareni) సంస్థ దేశంలోనే మరోసారి ఆదర్శంగా నిలిచింది. గనుల తవ్వకంతో పాటు పర్యావరణ ప్రమాణాలను పక్కాగా పాటించడంలో సింగరేణి కనబరిచిన ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. అయితే, డోర్లీ-2 (Doorly-2) గని మూసివేత (Mine Closure) ప్రక్రియను పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా అద్భుతంగా పూర్తి చేయడంతో, కేంద్ర సంస్థ గతంలో డిపాజిట్ చేసిన రూ.40 కోట్ల నిధులను వడ్డీతో సహా సింగరేణికి తిరిగి చెల్లించింది. గని మూసివేసిన ప్రాంతంలో పర్యావరణాన్ని పునరుద్ధరించిన తీరుపై కేంద్రం హర్షం వ్యక్తం చేసింది. ఇదే పద్ధతిలో త్వరలోనే డోర్లీ-1 గని మూసివేత ప్రక్రియ కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి కానుంది. అందుకు సంబంధించి మరో రూ.60 కోట్లకు పైగా డిపాజిట్ నిధులు త్వరలోనే సింగరేణికి తిరిగి వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.






