- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చలో ఫ్యూచర్ సిటీ : నాదర్ గుల్ డివిజన్ నుంచి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు
నాదర్ గుల్ డివిజన్ నుంచి ఏఐసీసీ విచార్ విభాగ్ కో-ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు భారీగా తరలివెళ్లారు.

దిశ, బడంగ్ పేట్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదగా నేడు భారత్ ఫీచర్స్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, స్కిల్ యూనివర్సిటీ భవనాల ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభకు నాదర్ గుల్ డివిజన్ నుంచి ఏఐసీసీ విచార్ విభాగ్ కో-ఆర్డినేటర్ రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సభకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాలుష్యం లేని మహానగరంగా పర్యావరణహితమైన ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో మహేశ్వరం నియోజకవర్గం రూపురేఖలు మారిపోనున్నాయని యువతకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తాయి అని తెలిపారు. ఫ్యూచర్ సిటి ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని, కాలుష్య పూరితమైన ఫార్మా సిటీని ప్రజలు కోరుకోవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత దిండు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.






