- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాసేపట్లో భారీ వర్షం.. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
రాష్ట్రంలో మరి కొన్ని గంటల్లో వాతావరణం మారనుందని, దీని ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరి కొన్ని గంటల్లో వాతావరణం మారనుందని, దీని ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంతాలు, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ 'రెడ్ అలర్ట్' జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మూడు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
విశాఖపట్నం సహా..
అలాగే విశాఖపట్నం సహా పరిసర జిల్లాల్లో కూడా కాసేపట్లోనే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభంకానుందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. తీరం వెంబడి గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సూచంచారు.






