దుండిగల్ లో హోసింగ్ కార్పొరేషన్ ఎండి సుడిగాలి పర్యటన

by Nallavelli.Anjaneyulu |

మేడ్చ‌ల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని దుండిగ‌ల్ స‌ర్కిల్ లో తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేష‌న్ ఎండీ. వీపీ గౌత‌మ్ మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్ మ‌ను చౌద‌రితో క‌లిసి సుడిగాలి ప‌ర్య‌ట‌న నిర్వ‌హించారు.

దుండిగల్ లో హోసింగ్ కార్పొరేషన్ ఎండి సుడిగాలి పర్యటన
X

దిశ, దుండిగల్ : మేడ్చ‌ల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని దుండిగ‌ల్ స‌ర్కిల్ లో తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేష‌న్ ఎండీ. వీపీ గౌత‌మ్.. మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్ మ‌ను చౌద‌రితో క‌లిసి సుడిగాలి ప‌ర్య‌ట‌న నిర్వ‌హించారు. బౌరంపేట‌, గండి మైస‌మ్మ‌, దుండిగ‌ల్ డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయంలో పర్యటించిన ఆయన లబ్దిదారులతో మాట్లాడి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నాడు. లబ్దిదారులకు అందజేయగా ఇప్పటి వరకు కేటాయించని డబుల్ బెడ్ రూమ్ ల వివరాలు హౌసింగ్ కార్పొరేషన్ అధికారుల ద్వారా సమాచారం సేకరించారు. లబ్దిదారులకు ఇళ్ల కేటాయిపు వాటి రిజిస్ట్రేషన్ పై ఆరా తీశారు. డబుల్ బెడ్ ఇళ్లకు రవాణా సౌకర్యం అందుబాటులో లేక పోవడం,తాగునీటి సమస్య, లిఫ్ట్ మెంటనెన్స్ తదితర సమస్యలు లబ్ధిదారులు అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తానని లబ్దిదారులకు హామీ ఇచ్చారు. లబ్ధిదారులను గుర్తించి త్వరలో ఇళ్ల కేటాయింపు జరుగుతుందన్నారు. అన్ని సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇక్కడ సమస్యలు స్థానిక జీహెచ్ఎంసీ అధికారులతోపాటు,హోసింగ్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు,లబ్దిదారులకు కేటాయించిన ఇళ్లల్లో అవకతవకలు జరిగిన, అమ్మకాల ద్వారా ఇతరులకు కేటాయించినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు,మున్సిపల్,రెవెన్యూ అధికారులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.

Next Story