- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెట్రోల్ డబ్బాతో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
తన భూమి హద్దులు స్పష్టంగా చూపించడం లేదంటూ ఓ మహిళా రైతు పెట్రోల్ డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో బుధవారం చోటుచేసుకుంది.

దిశ, నర్సాపూర్ : తన భూమి హద్దులు స్పష్టంగా చూపించడం లేదంటూ ఓ మహిళా రైతు పెట్రోల్ డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట వీరమణి అనే మహిళా రైతు పెట్రోల్ డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు ప్రయత్నించింది. శివంపేట్ మండలంలోని దొంతి గ్రామంలో 234 సర్వే నంబర్లో ఉన్న 1.21 గుంటల భూమిని గత రెండేళ్లుగా తన భూమికి సంబంధించిన సర్వే నిర్వహించినప్పటికీ అధికారులు తన భూమి హద్దులను స్పష్టంగా చూపించడం లేదని ఆమె ఆరోపించింది. తమ భూమిపై కన్నేసిన బడాబాబులు, రెవెన్యూ అధికారులు భూమి హద్దులు చూపించకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ చర్యకు దిగినట్లు ఆమె తెలిపింది. ఇది గమనించిన రెవెన్యూ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమె దగ్గర నుండి పెట్రోల్ డబ్బా తీసుకొని మహిళా రైతుతో అధికారులు మాట్లాడి ఆమె సమస్యపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో ఆర్డీవో కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళా రైతు భూమి వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే సర్వే చేసి మహిళా రైతు భూమి హద్దులు చూపిస్తామని అధికారులు పేర్కొన్నారు.






