ఏసీబీ వలలో కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ అసిస్టెంట్

by Nallavelli.Anjaneyulu |

కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న దనుక రాధికను ఏసీబీ కరీంనగర్ రేంజ్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

ఏసీబీ వలలో కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ అసిస్టెంట్
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న దనుక రాధికను ఏసీబీ కరీంనగర్ రేంజ్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కాంట్రాక్టర్ల బిల్లుల క్లియరెన్స్‌ను వేగవంతం చేయడం వంటి అధికారిక పనుల కోసం, బినామీ ఖాతాల ద్వారా కాంట్రాక్టర్ల నుంచి అక్రమ కమీషన్లు వసూలు చేయడానికి ఆమె తన పదవీ ని దుర్వినియోగం చేసినట్టు.. ఇటువంటి లావాదేవీలకు సహకరించేలా అవుట్‌సోర్సింగ్ సిబ్బందిపై అనవసరమైన ఒత్తిడి తెచ్చినట్టు గుర్తించారు. ఈ అధికారిణి ICDS గుడ్లు, పప్పు మరియు ఇతర సరుకుల సరఫరాదారుల నుంచి లంచం డిమాండ్ చేయడమే కాకుండా, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, తన కుటుంబ సభ్యుల ద్వారా UPI లావాదేవీల రూపంలో ఆ మొత్తాలను స్వీకరించారు.

జూన్ 2022 నుంచి ఏప్రిల్ 2024 మధ్య కాలంలో వారి ద్వారా ఆమె రూ. 2,37,500/- మేర అక్రమ మొత్తాలను పొందారు. తద్వారా, అక్రమ ప్రయోజనం పొందేందుకు ఆమె తన విధులను అక్రమంగా మరియు నిజాయితీ లేకుండా నిర్వహించారు. సదరు అధికారిణిని అరెస్టు చేసి, కరీంనగర్‌లోని SPE & ACB కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారు వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే.. చట్టపరమైన చర్యల కోసం ప్రజలు ACB టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని కోరారు. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), X/ట్విట్టర్ (@Telangana ACB) ద్వారా కూడా ACB తెలంగాణను సంప్రదించవచ్చు. బాధితుడు/ఫిర్యాదుదారు పేరు, వివరాలు గోప్యంగా ఉంచుతామ‌ని తెలిపారు.

Next Story