ఐటీని వినియోగించుకోండి: ఎస్ఐఆర్‌పై సీఈఓ కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

ఈనెల 25 నుంచి ప్రారంభంకానున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఐటి విరివిగా వాడుకోని ఓటరు నమోదు ప్రక్రియలో పూర్తి పారదర్శకంగా ఎలాంటి తప్పులకు తావివకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు..

ఐటీని వినియోగించుకోండి: ఎస్ఐఆర్‌పై సీఈఓ కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 25 నుంచి ప్రారంభంకానున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఐటి విరివిగా వాడుకోని ఓటరు నమోదు ప్రక్రియలో పూర్తి పారదర్శకంగా ఎలాంటి తప్పులకు తావివకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఐటి వినియోగంపై జిల్లా, మండల స్థాయి మాస్టర్ ట్రైనర్స్, ఐటి సపోర్ట్ టీం, డేటా ఆపరేటర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఐటి అంశం అత్యంత కీలకమైనదని, దానిని సిబ్బంది విరివిగా వాడుకొని ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం, సమర్థవంతంగా చేపట్టేందుకు దోహదపడుతుందని, అంతేకాకుండా ఓటరు జాబితా రూపొందించడంలో పారదర్శకత ఉంటుందని తెలిపారు.

ఓటర్లు ఆన్ లైన్ ద్వారా తమ పేరును ఎన్యుమరేషన్ చేసుకోవడానికి voter.eci.gov.in వెబ్ సైట్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారత ఎన్నికల కమిషన్ ఐటికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ECINET, BLO APP అందుబాటులోకి తెచ్చిందని, దీంతో ఎస్ఐఆర్ ప్రక్రియ మరింత సులభతరం చేసేందుకు ఇందులో వివిధ టూల్స్ ను పొందుపరిచిందని, వీటిని ఉపయోగించడంపై మాస్టర్ ట్రైనర్లు, ఐటి సపోర్ట్ టీమ్ లు క్షేత్రస్థాయిలో డేటా ఆపరేటర్లకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఆన్ లైన్ ద్వారా ఓటర్లను ఎన్యుమరేషన్ చేసుకునేందకు సదుపాయం కల్పించినందున దీనిపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను సీఈఓ ఆదేశించారు.

అనంతరం రాష్ట్ర శిక్షణ నోడల్ అధికారి బి. చెన్నయ్య, ఎస్‌ఐఆర్ ప్రక్రియలోని వివిధ దశలను సవివరంగా వివరించారు. పీఎం-ఐటీ డి. చిరంజీవి, ఈసీఐనెట్ (ECINET), బీఎల్‌ఓ యాప్‌కు సంబంధించిన సాంకేతిక శిక్షణను అందించారు. ఇందులో ఎన్యూమరేషన్ ఫారమ్‌లను పూరించడం, ఓటర్ల మ్యాపింగ్, సేకరించలేని ఎన్యూమరేషన్ ఫారమ్‌ల వర్గీకరణ, అలాగే ఇతర అనుబంధ కార్యకలాపాల విధానాలపై అవగాహన కల్పించారు.

Next Story