- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాయితో మోది భార్యను హత్య చేసిన భర్త
భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మానుకోవాలని చెప్పినా వినకపోవడంతో భార్యను రాయితో మోది హత్య చేసిన సంఘటన తాండూర్ మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, తాండూర్ రూరల్ : భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మానుకోవాలని చెప్పినా వినకపోవడంతో భార్యను రాయితో మోది హత్య చేసిన సంఘటన తాండూర్ మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కరణ్‌కోట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లా వాసి అయిన జీరో రిషి, తన భార్య సరీతా దేవి (33), కుమారుడు రాజుతో కలిసి తాండూర్ ప్రాంతానికి వలస వచ్చి, అల్లాపూర్ గ్రామంలో ఉన్న వీఆర్ పాలిషింగ్ యూనిట్‌లో 6 నెలలుగా కార్మికులుగా పనిచేస్తున్నారు. గత కొన్ని రోజులుగా రిషి భార్య సరీతా దేవి, అల్లాపూర్ గ్రామంలోని భాస్కర్ రెడ్డి పాలిషింగ్ యూనిట్‌లో పనిచేస్తున్న కార్మికుడు తోఫిక్ ఆలంతో అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయం పై భార్య భర్తలిద్దరూ మధ్య గొడవలు జరుగుతున్నాయి.
అక్రమ సంబంధం మానుకోవాలని రిషి తన భార్య సరితా దేవిని పలుమార్లు హెచ్చరించాడు. కానీ ఆమె తన భర్త మాట వినకుండా పద్ధతి మార్చుకోలేదు. మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో సరితా దేవితో తోఫిక్ ఆలం మధ్య ఉన్న సంబంధం విషయమై మళ్లీ గొడవ పడ్డారు. ఈ క్రమంలో రిషి తన భార్య సరితా దేవిపై రాయితో దాడి చేశాడు. తర్వాత అతను తన యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అనంతరం రక్తపు మడుగులో ఉన్న సరితా దేవిని చికిత్స కోసం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కరణ్‌కోట్ పోలీసులు భర్త రిషిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు నిందితుడు రిషిని కస్టడీ కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్లు వెల్లడించారు.






